వైసిపి నేత ఇంట్లో ఫైరింగ్…. ఇంతకీ ఏమి జరిగిందoటే?

Thursday, April 12th, 2018, 02:12:24 PM IST

తాడిపత్రి నియోజకవర్గం కు సంబంధించి వైసిపి పార్టీకి కీలక నేత అయిన రమేష్ రెడ్డి ఇంట్లో నేటిఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది, కాగా తెల్లవారుజనమున ఆయన ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడ్డాడు. అతడు రమేష్ రెడ్డిపై దాడికి యత్నించిన నేపథ్యంలో రమేష్ రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ గన్ తో ఆ అగంతకుడిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఆ దుండగుడికి కాలి మీద బుల్లెట్ తగిలి గాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గాయపడిన ఆ అగంతకుడిని తాడిపత్రిలోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే రమేష్ రెడ్డి ఇంట్లోకి చొరబడిందెవరు, దేనికోసం ఆ ఇంట్లోకి చొరబడ్డాడు, ఎందుకు అయనపై దాడి చేసాడు, అసలు అతనిని దాడిచేయమనిఎవరైనా పంపారా వంటి వివరాలు ఆ అగంతకుడు నోరు విప్పితే గాని బయటకు తెలిసే అవకాశం లేదని పోలీస్ లు చెపుతున్నారు. అతడు గాయంకరణంగా ప్రస్తుతం అపస్మారక స్థితిలో వున్నదని, స్పృహలోకి వచ్చిన అనంతరం ఈ ఘటనపై స్పష్టత లభిస్తుందని, పూర్తి స్థాయిలో విచారణకు ముందుకెళ్లే అవకాశం ఉంటుందని పోలీసులు చెపుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments