ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : వినయ విధేయ రామ

Thursday, January 10th, 2019, 10:26:09 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీనులా కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా అన్ని చిత్రాలతో పాటు “వినయ విధేయ రామ” చిత్రం కూడా విడుదలయ్యింది.ఈ సినిమాకి సంబందించిన ఫస్టాఫ్ రిపోర్ట్ ఇలా ఉంది.సినిమా ప్రారంభంలో నలుగురు అనాధ పిల్లలకు ఒక చిన్న బాబు దొరుకుతాడు.ఆ బాబు పెద్దయ్యాక రామ్ చరణ్ అవుతాడు.బోయపాటి శ్రీను ఎప్పుడు తన మార్క్ కామెడీ సన్నివేశాలు,కుటుంబ సన్నివేశాలతో పర్వాలేదనిపించారు.అలాగే పాటల విషయానికి వస్తే తస్సాదియ్యా పెద్దగా అనిపించకపోయినా రామ్ చరణ్ తనదైన స్టెప్పులతో నెట్టుకొచ్చేస్తారు.టీజర్ లో చూపించిన “రామ్ కో..ణి..దె..ల” డైలాగ్ మరియు ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్ ఫస్టాఫ్ కి ప్రధానాకర్షణగా నిలుస్తాయి.ఇప్పటి వరకు అభిమానులు ఏమైతే కోరుకుంటారో అవన్నీ బోయపాటి బాగానే అందించారు..మరి ఇదే ఊపును సెకండాఫ్ లో కూడా కొనసాగిస్తారో లేదో చూడాలి.