మొదటి ఐకియా స్టోర్ మనదగ్గరే!

Thursday, August 9th, 2018, 03:00:25 PM IST

గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం విదేశీ కంపెనీలకు ఘన స్వాగతం పలుకుతున్న సంగతి తెలిసిందే. ఇక మరో ప్రముఖ సంస్థ ఐకియా కూడా తన మార్కెట్ ను స్టార్ట్ చేసింది. ఇండియాలోనే ఐకియా మొదటి షోరూమ్ ను హైదరాబాద్ లోనే స్థాపించింది. గురువారం హైటెక్ సిటీలో ఐకియా షో రూమ్ ను ప్రారంభించిన కేటీఆర్ హైదరాబాద్ లో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. ఈ కంపెనీ స్థాపన ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశం లభించిందని ఐకియా లో రెండు వేల మందికి ప్రత్యక్షంగాను మరో మూడు వేల మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.

దాదాపు భారతదేశంలో 1000 ఇళ్లకు పైగా రీసెర్చ్ చేసి ఇక్కడున్న వారికీ తగ్గట్టుగా అవసరాలను అందిస్తున్నట్లు ఐకియ భారత సీఈఓ పీటర్‌ బెట్జెల్‌ తెలిపారు. ఇంట్లో ఉపయోగపడే చిన్న చిన్న వస్తువుల నుంచి గదులకు సంబందించిన అలంకరణలు అలాగే ఫర్నిచర్ వంటి ఈ స్టోర్ లో లభ్యమవుతాయని తెలిపారు. ఇక తాము విక్రయించే వస్తువులు 20 శాతంకు పైగా ఇక్కడా తయారైనవే అని చెబుతూ.. భారతదేశంలో మొత్తంగా రూ.10,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐకియా సీఈఓపేర్కొన్నారు.

ఇక ఐకియా విశిష్టతల విషయానికి వస్తే.. హైటెక్ సిటీలో 13 ఎకరాల స్థలంలో దీన్ని స్థాపించారు. షాపింగ్ కు వచ్చిన వారికోసం స్పెషల్ గా రెస్టారెంట్ ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది ఒకేసారి కూర్చునే విధంగా నిర్మించారు. 7,500 రకాల వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. అయితే అందులో 1000కి పైగా వస్తువుల ధరలు రూ.200 లోపే ఉంటాయి. ఇక 70 లక్షల మంది ఈ స్టోర్ ను సందర్శించే అవకాశం ఉందని కంపెనీ యాజమాన్యం తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments