ఒబామాలా మారిపోయిన మిషెల్.. భర్తని ఇమిటేట్ చేసిన వీడీయో వైరల్..!

Thursday, September 22nd, 2016, 05:46:52 PM IST

tv
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా ఓ ఇంటర్వ్యూ లో నవ్వులు పూయించారు.త్వరలో ఒబామా పదవి విరమణ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మిషేల్ ఓ ఇంటర్వ్యూ లో ఒబామాని ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది.

వైట్ హౌస్ లో కుటుంబమే మొత్తం కలసి డిన్నర్ చేస్తున్న సమయంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో మిషెల్ వివరించారు. డిన్నర్ చేస్తున్న సమయంలో తన పెద్దకూతురు మాలియా ఒబామాని గ్లోబల్ వార్మింగ్ వంటి పెద్ద పెద్ద ప్రశ్నలను అడిగేదిఅని మిషెల్ అన్నారు. ఆ ప్రశ్నలకు ఒబామా ఎలాంటి సమాధానం ఇచ్చేవారో ఇమిటేట్ చేసి మరి మిషెల్ వివరించారు.ఒబామా పాయింట్ 1, పాయింట్ 2 అని వివరిస్తారని అతనిని అనుకరిస్తూ మిషెల్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. బుధవారం సాయంత్రం యూట్యూబ్ లో పెట్టిన ఈ వీడియో ఇప్పటికే 10 లక్షల వ్యూస్ తో వైరల్ గా మారింది.