చేప మందు పంపిణీ ప్రారంభం

Saturday, June 8th, 2013, 12:02:31 PM IST


మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ లో బత్తిన సోదరులు ప్రతిఏటా ఇచ్చే చేప మందు కోసం భారీ సంఖ్యలో ఆస్తమా బాధితులు భాగ్యనగరానికి తరలివచ్చారు. దేశంలో పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన రోగులు.. ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 10 వేల మంది తరలిరావడంతో కాటేదాన్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఈ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి 32 కేంద్రాల ద్వారా చేప మందు పంపిణీ జరుగుతుంది.

చేప మందు పంపిణీ  సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. మరోవైపు బత్తిని సోదరులకు హైకోర్టులో ఊరట లభించింది. చేపమందుపై లోకాయుక్త ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడంతో చేప మందు పంపిణీకి లైన్ క్లియర్ అయింది.