రింగురోడ్డు వద్ద ఐదు డెడ్ బాడీలు..ఘోరం వెనుక ఉన్న అనుమానాలు ఇవే..!!

Tuesday, October 17th, 2017, 04:48:05 PM IST

హైదరాబాద్ నగర ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు పక్కన ఐదు మృత దేహాలు కనిపించడం కలకలం రేపుతోంది. చనిపోయిన ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఓ ఆర్ ఆర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాతంలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు శవాలుగా కనిపించినట్లు స్థానికులు గుర్తించి పోలీస్ లకు సమాచారం అందించారు. మృతదేహాలని స్వాధీనం చేసుకున్న పోలీస్ లు పోస్ట్ మార్టం కొరకు పంపారు. కాగా వారంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ లు ప్రాధమిక అంచనాకు వచ్చారు. కానీ ఈ కేసులో ఉన్న అనుమానాలు అలాగే ఉన్నాయ్.

మృతులు పఠాన్ చెరు అమీన్ పూర్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య మాధవి, కుమారుడు వర్షిత్ లతో పాటు ప్రభాకర్ రెడ్డి బంధువులు రవీందర్ రెడ్డి భార్య లక్ష్మి, ఆమె కూతురు హిందుజా లు రెండు రోజుల క్రితం శ్రీశైలం డ్యామ్ చూసి రావడనికని కారులో బయలు దేరారు. మరో గంటలో ఇంటికి చేరుకుంటామని తెలిపిన తరువాత వీరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. చివరకు వీరు మృత దేహాలుగా మారడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు. రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ కలసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వలనే ఆత్మహత్య చేసుకుని ఉండే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.