తాజా వార్త : టాలీవుడ్ నటీమణులను కించపరిచిన ఓ న్యూస్ ఛానల్ ఎడిటర్ !!

Sunday, March 25th, 2018, 03:44:13 AM IST

ఇటీవల ప్రత్యేక హోదా ఉద్యమం లో భాగంగా టిడిపి ఎమ్యెల్సీ రాజేంద్రప్రసాద్ టాలీవడ్ పరిశ్రమ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత , కాస్త తగ్గిన ఆయన నిన్న మాట్లాడుతూ తాను కావాలని చిత్ర పరిశ్రమని కించపరచలేదని, కాకపోతే సీనియర్ నటులు ముందుకు వచ్చి హోదా ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తే బాగుండేది కదా అనే విధంగా అన్నాను అని తగ్గి మాట్లాడారు. అయితే ఈ విషయమై ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణ మురళి నేడు ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ పై రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు సరైనవి కావని, అయినా చంద్రబాబు మొదట ప్రత్యేక ప్యాకెజీ కి ఒప్పుకున్నారు. ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు విపక్ష, ప్రతిపక్ష నేతలు హోదా ఉద్యమాన్ని బలపరుస్తుంటే, వారికి ఎక్కడ పేరు వస్తుందో అని భయపడి హోదా వాదాన్ని ఇప్పుడు ముందుకు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. అలానే మంత్రి లోకేష్, ఇతర టిడిపి నేతలు అవినీతి చేస్తున్నారు కాబట్టే కదా, మొన్న సభలో పవన్ వున్నా విషయం కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు అన్నారు. అయితే ఈ చర్చ జరుగుతుండగా వున్నట్లుండి చర్చలో పోసాని తో పాల్గొంటున్న ఆ ఛానల్ ఎడిటర్, మీ టాలీవుడ్ లో కూడా కొందరు ఆడవాళ్లు…. అంటూ, అసభ్య పదజాలం వాడుతూ టాలీవుడ్ నటీమణులను కించపరిచాడు.

అయితే ఆ ఛానల్ అధికార పార్టీ వారికి చెందినదని, కాబట్టే వున్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన పోసాని వ్యాఖ్యలకు ఒకింత కలత చెందిన ఆ ఎడిటర్ టాలీవుడ్ నటీమణులపై ఇలా అన్నాడని ఒక వాదన నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఒక బాధ్యతాయుతమైన ఎడిటర్ హోదాలో వున్నపుడు అన్ని పార్టీలను సమానంగా చూడాలిగాని తమ ఛానల్ ఫలానా పార్టీ వరిదని, ఆ పార్టీ తప్పులు ఒప్పుకోకుండా అవతలి వారిని ఇలా నీచంగా మాట్లాడడం మీడియా వృత్తికే సిగ్గుచేటని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే నేడు ఆ ఛానల్ ఎడిటర్ పై మా అధ్యక్షులు శివాజీరాజా, నటి హేమ, నటులు బెనర్జీ, ఝాన్సీ, ఏడిద శ్రీరామ్ తదితరులు జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసారు…..