ప్లాష్ న్యూస్‌.. వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన‌.. సినీన‌టుడు మోహన్ బాబు..!

Friday, November 2nd, 2018, 03:25:30 PM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నంలో భాగంగా జ‌రిగిన దాడి పై జ‌గ‌న్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో వైధ్యుల స‌ల‌హా మేర‌కు జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ప్ర‌స్తుతం లోట‌స్ పాండ్ వ‌ద్ద ఉన్న త‌న ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, ప్ర‌ముఖులు జ‌గ‌న్‌ను పరామ‌ర్శిస్తున్నారు. అయితే తాజాగా సినీ న‌టుడు మోహ‌న్ బాబు జ‌గ‌న్‌ను ప‌రామ‌ర్శించారు.

దీంతో ఈ మ్యాట‌ర్ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేప‌ధ్యంలో మీడియా ముందుకు వ‌చ్చిన మోహ‌న్ బాబు మాట్లాడుతూ జ‌గ‌న్ ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్నార‌ని, వైధ్యుల సూచ‌న‌ల మేర‌కు ఆయ‌న విశ్రాంతి తీసుకుంటున్నార‌ని, జ‌గ‌న్‌పై దాడి జ‌ర‌గాల్సింది కాద‌ని, ఆయ‌న నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాల‌ని మోహ‌న్ బాబు అన్నారు. ఇకపోతే గ‌త నెల 25వ తేదీన జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆదాడిలో జ‌గ‌న్ భూజానికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో గాయం ఇంకా ప‌చ్చిగానే ఉంద‌ని. దీంతో కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. దీంతో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇచ్చారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర ఈ నెల 10న ప్రారంభం కానుంద‌ని వైసీపీ శ్రేణులు ప్ర‌క‌టించారు.