ఫ్లాష్ న్యూస్ : హైదరాబాద్ లోని ఓ ఫ్లైఓవర్ పై లీక్ అయిన ఆయిల్

Friday, March 16th, 2018, 10:39:49 PM IST

నిరంతరం హెవీ ట్రాఫిక్ తో హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రహదారులు ఎప్పుడు జనసందోహంతో కిటకిటలాడుతుంటాయి. వేసవి కాలం ప్రారంభమయింది, ఈ వేసవిలో హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ ప్రాంతంలో నేడు తేలికపాటి వర్షం కురిసింది. అసలే ఆ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఆ ఫ్లైఓవర్ పై నిరంతరం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఆ ఫ్లైఓవర్ పై ఒక ఆయిల్ టాంకర్ నుండి ఆయిల్ లీక్ అవ్వడంతో దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు ఆయిల్ వల్ల టైర్లు స్కిడ్ అయి జారీ పడటం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై కాకుండా వేరే రూట్ లో వెళితే బాగుంటుందని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు….