ఫ్లాష్ న్యూస్ : 2019 ఎన్నికల్లో పొత్తుల పై పవన్ సంచలన నిర్ణయం !!

Sunday, March 18th, 2018, 02:54:57 PM IST

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీబిజీగా ఉంటున్నారు. పలువురితో మంతనాలు జరపటం, వివిధ సమస్యలపై స్పందించటం, బాధితులను పరామర్శించటంతో పాటు మీడియాతో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవడం చేస్తున్నారు. తాజాగా విజయవాడలో మీడియాతో సమావేశాన్ని నిర్వహించిన పవన్ ఈ సందర్భంగా మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోనున్నారా అన్న ప్రశ్నకు, వచ్చే ఎన్నికల్లో తాను ఎవరితోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చేశారు. 2019 ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. హోదా విషయం మీద మాట్లాడటం మానేసి, బాబును టార్గెట్ చేయటం సరికాదంటూ వెల్లువెత్తుతున్న విమర్శలపై స్పందించిన పవన్, హోదా ఇష్యూ మీద నాలుగేళ్ల క్రితమే తాను స్పందించినట్లు చెబుతున్నారు.

మీడియా సమావేశంలో పవన్ ప్రస్తావించిన అంశాలు ఇవే….

హోదా అంశాన్ని నాలుగేళ్లుగా ప్రస్తావిస్తునే ఉన్నా. మోడీపై నేరుగా విమర్శలు చేసింది నేనే. హోదాపై ఇప్పటికే పోరాడాను. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా.

రాజధాని నగరం కోసం సమీకరించిన 33వేల ఎకరాల్లో నాలుగో వంతు మాత్రమే వినియోగిస్తారని నేనూ అంగీకరిస్తా. అయితే, గతంలో బాబుతో సమావేశమైనప్పుడు రాజధాని కోసం 1400 ఎకరాలు సరిపోతుందన్నారు.

మంగళగిరి దగ్గరున్న అటవీ భూముల్ని డీ నోటిఫై చేసిఅక్కడే రాజధాని నగర నిర్మాణం చేస్తానని చెప్పారు. కానీ, ఆ తర్వాత రైతుల నుంచి 33 వేల ఎకరాలు సమీకరించారు. దీన్నే ప్రశ్నిస్తున్నా.

ఒక ప్రాంతం సంస్కృతిని, సంప్రదాయాన్ని మరో ప్రాంతం గుర్తించకుంటే ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతాయి. తెలంగాణ విషయంలో జరిగింది అదే. ఇప్పడు రాయలసీమ, కళింగాంధ్రలలో ప్రాంతీయవాదం మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ఫాతిమా కాలేజీ అంశం కేంద్రం పరిధిలోనిదే. కాకుంటే సానుభూతితో రాష్ట్ర సర్కారు పరిష్కరించి ఉంటే బాగుండేది.

2014 ఎన్నికల సమయంలో జగన్ ను విమర్శించొద్దని, తమకు ఆయనంటే అభిమానమని, నేనంటే ఇష్టమని విశాఖలో పలువురు నాకు చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఉండదు అన్నారు….