ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్స్.. భారీ తగ్గింపు ధరలు!

Wednesday, May 9th, 2018, 01:18:23 AM IST

ఆన్ లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత నెటిజన్స్ ఎక్కువగా మొబైల్స్ లోనే షాపింగ్ చేసేస్తున్నారు. బిజీ బిజీ లైఫ్ లో సమయం లేక అరచేతిలోనే అన్ని రప్పించేసుకుంటున్నారు. దానికి తోడు ఆన్లైన్ సంస్థలు కూడా జనాల్ని మరింత ఆకర్షించేందుకు భారీ ఆఫర్స్ ని అందిస్తోంది. గత ఏడాది దీపావళి దసరా సందర్భంగా రికార్డ్ స్థాయిలో ఆఫర్స్ ని అందించాయి. సంక్రాతి కి కూడా ఆన్లైన్ కంపెనీలు పోటీ పడి మరి డిస్కౌంట్స్ ని ఇచ్చాయి. ఇక ఈ నెల 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ షాపింగ్ డేస్ ను ప్రకటించింది.

ఊహించని విధంగా ల్యాప్ టాప్స్ మొబైల్స్ వంటి వాటిల్లో భారీ డిస్కౌంట్స్ ను ప్రకటించడానికి రెడీ అయ్యింది. గృహోపకరణాలు – ఫర్నీచర్‌, దుస్తులు మరియు చెప్పులు అలాగే టెలివిజన్‌ వంటి వాటిపై స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. ఇక సమ్మర్ సెల్ ప్రత్యేకతలో భాగంగా ప్రత్యేకంగా గేమ్స్‌ కార్నర్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించింది. లక్కు మీదైతే ఒక్క రూపాయికే ల్యాప్‌టాప్‌ అలాగే మొబైళ్లను గెలుచుకోవచ్చు.

ఇక వాటితో పాటుగా 100% క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ఉన్న వారికి స్పెషల్ గా 10% క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి.

75శాతం వరకూ హెడ్‌ఫోన్‌ యాక్ససరీలపై రాయితీ.
పవర్‌ బ్యాంకులు రూ.499కే .
గూగుల్‌ పిక్సెల్‌ ధర రూ.50వేలు ఉండగా, తగ్గింపు ధర రూ.34,999
శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ రూ.17,900 ఉండగా, తగ్గింపు ధర రూ.10,999కే
మే 15న హానర్‌ 10ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్‌

  •  
  •  
  •  
  •  

Comments