వారణాసిలో కూలిన ఫ్లైఓవర్……. షాక్ లో మోడీ!

Wednesday, May 16th, 2018, 12:51:29 PM IST

ఇదివరకు అక్కడక్కడ మన దేశంలో ఫ్లైఓవర్ లు కూలిన ఘటనలు మనం చూసాము. అయితే నేడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి కూలిన ఫ్లైఓవర్ ఉదంతంతో అక్కడి ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. అది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో బిజెపి పై అలానే ఆయనపై విమర్శల దాడి మొదలయింది. విషయంలోకి వెళితే, వారణాసిలోని పాత రైల్వే స్టేషన్ వద్ద రూ.129కోట్ల రూపాయల ఖర్చుతో, దాదాపు 2261 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రభుత్వం మొదలెట్టింది. కాగా ఇప్పటికే పనులు ఊపందుకున్న ఈ ఫ్లైఓవర్, పనులు జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా నేడు కుప్పకూలింది.

ఈ దుర్ఘటనలో ఒక మినీ బస్సు, నాలుగు కార్లు, దాదాపు పన్నెడు దాకా టూ వీలర్లు ధ్వంసం అయ్యాయని, అంతేకాక దాదాపు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా సమాచారమా అందుతోంది. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఎన్డిఆర్ ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడికి చెరుకును శిథిలాల క్రింద వున్న వారిని బయటకి తీసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోడీ, ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాదు ఈ దుర్ఘటన వార్త విన్నాక కర్ణాటక గెలుపును ఆస్వాదించలేకపోతున్నాం అని అన్నారు.

మరోవైపు దుర్ఘటన ప్రాంతాన్ని సందర్శించి యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనపై బాధ్యతవహిస్తూ చనిపోయిన వారి కుంటుంబాలు సానుభోతి తెలిపారు. కాగా ఈ ఘటనలో గాయాలపాలయిన వారికి రూ.2 లక్షలు, చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. నిర్మాణపనుల్లో పాల్గొంటున్న ఆ ప్రాజెక్టు చీఫ్ మేనేజర్, మరియు ముగ్గురు ఇతర సిబ్బందిని వెంటను విధులనుండి తొలగించారు. కాగా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిందని, ప్రాజెక్టు పనుల్లో నాసిరకమైన ఇసుక, సిమెంటు, ఇనుము మరియు ఇతర సామగ్రిని వాడుతున్నారని, ఘటనలో చనిపోయిన ప్రజలకు మోడీ బాధ్యతవహించాలని ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు……

Comments