డెలివెరి బాయ్ జాబ్ జీతం 35వేలు.. కష్టపడుతున్న యువత!

Wednesday, August 1st, 2018, 12:37:01 AM IST

ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ యువత లెక్క చుస్తే చాలానే ఉంది. అయితే చాలా వరకు యువకులు ఖాళీగా ఉండకుండా ఎదో ఒక వర్క్ చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువగా అందరూ డెలివరీ బాయ్ గా చేయాలనీ అనుకుంటున్నారు. ఎందుకంటే ఎలాంటి అనుభవం లేకపోయినా కూడా కేవలం ఒక బైక్ ఉంటే చాలు ఈజీగా 25 వేల నుంచి 30 వేల వరకు నెలసరి ఆదాయాన్ని పొందుతున్నారు. దానికితోడు ఇన్సెటివ్స్ కూడా వస్తుండడంతో కష్టజీవులు ఏ మాత్రం తగ్గడం లేదు.

నగరంలో చాలా వరకు ఆన్లైన్ ఫుడ్ కి మంచి డిమాండ్ ఉంది. దీంతో స్విగ్గి జొమాటో లాంటి సంస్థలు వాటి పరిధిని పెంచుకుంటూ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా జొమాటో ఇటీవల కాలంలో టాప్ లో నిలిచిందని చెప్పాలి. సగానికి పైగా డిస్కౌంట్ ఇవ్వడంతో మంచి పాపులారిటీ పెరిగింది. స్విగ్గి కూడా తన స్టైల్ లో స్పీడ్ డెలివరి అంటూ హడావుడి చేస్తోంది. ఇక ఆర్దర్లు ఎక్కువవుతుండడంతో డెలివెరి బాయ్ లు ఎక్కువగా అవసరమవుతున్నారు.

దీంతో కంపెనీలు కూడా డెలివెరి బాయ్ లను స్పీడ్ గా పనిచేసేవిధంగా ఇన్సెంటివ్స్ ను ప్రకటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఐటి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగి నెలసరి ఆదాయంలోల్ మొదట్లో 12 వేలు కాగా డెలివెరి బాయ్ జీతం 25 వేలు కావడం విశేషం. ఇక 30 నుంచి 45 వేలు అందుకుంటున్న కష్ట జీవులు కూడా ఉన్నారట. మొదట్లో ఉబెర్ ఓలా లాంటి కంపెనీలు డ్రైవర్లను ఇలానే ఆకర్షించి ఆ తరువాత ముంచేశాయని కొందరు కామెంట్స్ చేస్తున్నప్పటికీ ఫుడ్ కి సంబందించిన కంపెనీలకు డోకా ఉండదని మరికొంత మంది వాదిస్తున్నారు. ఇక చాలా వరకు యువత పార్టీ టైమ్ లో భాగంగా ఫుడ్ డెలివెరి బాయ్ గా చేస్తూ చదువును కొనసాగిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments