ఫుడ్ డెలివరీ బాయ్ మానవత్వం!

Wednesday, June 13th, 2018, 12:44:05 AM IST

మనం ఏదైనా ఫుడ్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే అది ఎంత త్వరగా వస్తుందా, ఇంకెంత త్వరగా దాన్ని లాగించేయాల అని అనుకుంటుంటాం. అదే ఒకవేళ ఆ ఫుడ్ తీసుకువచ్చే డెలివరీ బాయ్ కొంచెం లేట్ గా వస్తే మాత్రం కొందరు సహించరు సరికదా అతనిపై విరుచుకుపడిన సందర్భాలు లేకపోవలేవు. ఇకపోతే నేడు చైనాలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ఆన్లైన్ లో ఒకరు ఫుడ్ ఆర్డర్ చేయడంతో అది డెలివరీ చేయడానికి వెళ్తున్న అతడికి అటుపక్కగా మెల్లగా వెళ్తున్న అంబులెన్సు, దేనికోసమో వెతుకుతున్నట్లు అనిపించిందట. వెంటనే అతడు బండి దిగి విషయం ఏమిటని అంబులెన్సు అతన్ని అడగ్గా, తమ హాస్పిటల్ కు ఒక అడ్రస్ నుండి ఒకరికి దెబ్బతగిలిందని ఫోన్ వచ్చిందని, అతని అడ్రస్ కోసం వెతుకుతున్నామని అంబులెన్సు డ్రైవర్ చెప్పాడట.

వెంటనే ఆ అడ్రస్ తనకు తెలుసునని, అంబులెన్సు కు దారి చెప్పాడట కొరియర్ బాయ్. అయితే అంబులెన్సు సరైన దారిలో వెళ్తుందో లేదో, ఒకవేళ వెళ్లకపోతే దెబ్బతగిలిన వ్యక్తికి ఏమి ప్రాణం మీదకు వస్తుందో అని భయపడి తనవెనకే అంబులెన్సు ఫాలో కమ్మని చివరికి ఆ అడ్రస్ కు తీసుకెళ్ళాడట. కాగా అతడు బైకుపై దారి చూపిస్తూ వెళుతున్న సన్నివేశాన్ని అంబులెన్సు డ్రైవర్ తన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ ఆ డెలివరీ బాయ్ ని హీరో అని, రియల్ హ్యూమన్ అని పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఇందులో ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, అంబులెన్సు కు దారిచూపించటానికి వెళ్లినప్పటికీ అతను చివరకు తన ఫుడ్ డెలివరీని మాత్రం అనుకున్న సమయానికి చేరవేయగలిగాడు…..

  •  
  •  
  •  
  •  

Comments