వైరల్ వీడియో : ఫుడ్ ట్రైన్ వస్తోంది.. వేచి ఉండండి!

Friday, June 8th, 2018, 02:33:20 PM IST

“రాజధాని ఎక్స్ ప్రెస్ మరికొన్నీ నిమిషాల్లో ఒకటవ నెంబర్ ఫ్లాట్ ఫార్మ్ కు వచ్చును” అని మూడు భాషల్లో విన్నా వినకపోయినా రైల్వే స్టేషన్ లో వస్తూనే ఉండే ఎనౌన్స్ మెంట్ సౌండ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. కానీ ఓ హోటల్ లో మాత్రం డిఫెరెంట్ గా ఈ సౌండ్ తో ఫుడ్ ట్రైన్స్ వస్తున్నాయి. కాకపోతే ఎనౌన్స్ మెంట్ లో కాస్త తేడాలు వస్తాయి. రెండవ నెంబర్ టేబుల్ వద్దకు బిర్యానీ వస్తోంది దయచేసి రెండు నిమిషాలు వేచి ఉండండి అంటూ ట్రైన్ వస్తుంది.

గౌహతి లోని ఒక రెస్టరెంట్ లో ఇలాంటి సౌండ్ లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విదేశాల్లో ఇది కామన్ అయినా మన దేశంలో మాత్రం చాలా కొత్త విషయం. టేబుల్ అన్నిటికి కనెక్ట్ అయ్యేలా చిన్న చిన్న ట్రైన్ పట్టాలను కలిపి డిజైన్ చేశారు. ట్రైన్ పై ఫుడ్ పెట్టి కస్టమర్స్ కూర్చున్న దగ్గరికి వెళ్లి ఆగేలా టెక్నాలిజీని డెవలప్ చేసుకున్నారు. ఒక చోట నుంచి వాటిని కంట్రోల్ చేస్తుంటారు. ఒకసారి అందుకు సంబందించిన వీడియో చుస్తే మీకే అర్ధమవుతుంది.