ఫుట్ బాల్ కింద పడకుండా బట్టలిప్పేశాడు!

Monday, June 18th, 2018, 12:54:57 PM IST

రష్యా లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ కు అభిమానుల నుంచి అందుతున్న ప్రేమ అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా కూడా ఫుట్ బాల్ ప్రేమికులు వారి అభిమానంతో నగరాలను హోరెత్తిస్తున్నారు. కృత్రిమ భూకంపాలు వస్తున్నాయి అంటే వారి అభిమానం ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల ఒక యువకుడు కుడా తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. కాస్త కూడా తడబడకుండా ఫుట్ బాల్ తో అతను చేసిన ట్రిక్స్ ఔరా అనిపించాయి. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా నెల మీద ఓ మనిషి బాల్ ని ఆడించడం కామన్. కానీ అతను గోడ మీద అలాగే పోల్ పై ఫుట్ బాల్ ని తెగ తిప్పేశాడు. బంతిని కింద పెట్టకుండా తన పై వస్త్రాలను విప్పేసి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా పోల్ అంచు వరకు వెళ్లి బంతిని కాలితో పట్టుకోవడం జనాలకు తెగ నచ్చేసింది.