ఆరోగ్యం బాలేదని బాబా దగ్గరకు వెళ్లిన మహిళకు ఏమైందంటే?

Monday, April 23rd, 2018, 10:39:26 AM IST

ప్రస్తుతం కొందరు బాబాలు, సాధువుల పేరుతో మాయమాటలు చెప్పి ప్రజలను మోసగిస్తూ దోచుకుంటున్న కధనాలు ఎన్నో చూస్తున్నాం. అయినప్పటికీ కొందరు మాత్రం ఈ రకమైన మూఢ నమ్మకాలతో అటువంటి వారిని నమ్మి ముందుకు సాగుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆరోగ్యం బాలేదని ఒక యువతి డాక్టర్ దగ్గరకు వెళితే, మీకు మానసిక ప్రశాంతత అవసరమని, ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఆరోగ్యం కాపాడుకోమని చెప్పారు. అయితే ఇరుగు పొరుగు వారి సమాచారంతో ఆ మహిళ ఒక బాబా దగ్గరకు వెళ్ళింది. అలా వెళ్లిన ఆమెకు అక్కడ ఆమెకు ఊహించని పరిణామమే ఎదురయింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఆ ఘటన ఏంటంటే, ఇటీవల ఓ మహిళ ఆరోగ్యం బాగోలేదంటూ బాబాను ఆశ్రయించింది. ఆ మహిళకు మాయమాటలు చెప్పిన బాబా నలుగురితో కలిసి అత్యంత అమానుషంగా గ్యాంగ్‌‌రేప్‌కు పాల్పడ్డాడు.

అంతే కాకుండా అత్యాచారం చేసేప్పుడు తీసిన ఫోటోలతో ఆ మహిళపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయిచింది. ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ దొంగబాబా ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళ మహారాష్ట్ర వాసిగా తెలుస్తోంది. ప్రజలకు తాము ఇటువంటి బాబాలను నమ్మవద్దని ఎంత చెప్పినప్పటికీ, కొందరు మాత్రం వారి ఉచ్చులో ఇరుక్కుని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని, అందువల్ల ఇకనైనా ఇటువంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ లు చెపుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments