పవన్ మొదటి స్థానం..మహేష్ మూడో స్థానం..ఫోబ్స్ లెక్కలు నమ్మొచ్చా..?

Wednesday, December 5th, 2018, 06:47:59 PM IST

ఇప్పుడున్న రోజుల్లో యువతకు అందులోను సోషల్ మీడియా కోసం బాగా తెలిసినటువంటి యువతకు ఫోబ్స్ మ్యాగిజైన్ కోసం తెలిసే ఉంటుంది.వీరు ప్రతీ ఏడాది భారతదేశంలో ఎక్కువ సంపాదన ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారో ఆ అన్ని లెక్కల ప్రకారం సినీ నటుల నుంచి క్రీడాకారుల వరకు ఒక 100 మంది జాబితాను పొందుపరుస్తారు.అయితే ఈ సారి విడుదల చేసినటువంటి జాబితాలో మాత్రం ఎందుకో తేడా కొడుతుంది అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.ఎందుకంటే టాలీవుడ్ నుంచి ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన పవన్ మొదటి స్థానంలోనూ,టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మూడో స్థానంలో నిలవడం ఆశ్చర్యానికి గురి చేసింది.

పవన్ తన చివరి చిత్రం “అజ్ఞ్యాతవాసి” తర్వాత ఇక సినిమాలు చేయడంలేదు అని ప్రకటన ఇచ్చేసారు.ఆ చిత్రానికి ఎంత భారీ మొత్తంలో పారితోషకం తీసుకున్నా 30 కోట్లు మించి ఉండదు.దానికి తోడు పవన్ ప్రకటనలలో కూడా పెద్దగా కనిపించరు..ఒక పక్క చూసుకున్నట్టయితే సూపర్ స్టార్ మహేష్ యొక్క పారితోషకం భారీ మొత్తంలోనే ఉంటుంది,దానికి తోడు ఆయన అనేక యాడ్స్ లో కూడా తళుక్కుమంటారు.వాటికి కూడా మహేష్ భారీ మొత్తంలోనే పారితోషకం తీసుకుంటారు.మరి అలాంటిది మహేష్ కు పవన్ కన్నా చాలా తక్కువ సంపాదన కలిగిన వ్యక్తిగా టాలీవుడ్ నుంచి మూడో స్థానంలో నిలవడం కొంతమందికి ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ ఫోబ్స్ లెక్కలు మాత్రం ఈ సారి అంత ఖచ్చితంగా అయితే రాలేదు అంటూ మరికొంత మంది సోషల్ మీడియాలో పెదవి విరుస్తున్నారు.