దళితుడికి బలవంతంగా అది తాగించారు…

Tuesday, May 1st, 2018, 10:40:11 AM IST

అది ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా. అక్కడ ఉన్నత కులాలకు చెందిన రైతులు మానవత్వాన్ని మట్టి కరిపించారు. ఓ దళితుడికి బలవంతంగా మరో మనిషి మూత్రం తాగించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా మీడియాలోకి వెలుగు చూసింది. తన పంటపొలాన్ని సాగు చేయడానికి నిరాకరించాడన్న కోపంతో ఓ భూసామి.. దళితుడికి బలవంతంగా మూత్రం తాగించారు.

దళితుడిని తీవ్రంగా చితకబాది.. కొంచమైనా సానుభూతి చూపించకుండా నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. చెప్పులతో కొట్టారు. ఆ తర్వాత ప్రజలందరూ చూస్తుండగానే.. దళితుడికి మూత్రం తాగించారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విజయ్ సింగ్, విక్రమ్ సింగ్, సోమ్‌పాల్ సింగ్, పింకును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చేసిన నేరానికి తగిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments