సీఎంతో మాజీ మంత్రి సబితా భేటీ – టికెట్ కోసమేనా…?

Wednesday, March 13th, 2019, 05:16:15 PM IST

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరేందుకు దాదాపుగా సిద్ధమయినట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం, తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ను తన ముగ్గురు కుమారులతో సహా కలిశారు. అందుకోసమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తో పటు మరో పారిశ్రామిక వేత్త బాగా కష్టపడ్డారంట కూడా. తన కుమారుడు కార్తీక్‌రెడ్డికి తెరాస తరపున చేవెళ్ల లోక్‌సభ టికెట్‌ ఇవ్వాలని కెసిఆర్ ని కోరనుందంట సబితా.

ఈ మధ్యనే తెరాస నేత కేటీఆర్ తో కలిసి సబితా మరియు తన కుమారుడు కూడా కలిసారుట. వారు పార్టీలోకి రావడమా లేక కాంగ్రెస్లోనే కొనసాగడమా అనేది కెసిఆర్ నిర్ణయిస్తాడని కేటీఆర్ అన్నారు.