పల్టీ కొట్టిన మాజీ ఎంపీ కారు..!

Saturday, February 25th, 2017, 09:28:18 AM IST


మాజీ ఎంపీ, తెలంగాణా పిసిసి ఉపాధ్యక్షుడు అయిన పొన్నం ప్రభాకర్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శివరాత్రి సందర్భంగా పొన్నంప్రభాకర్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా ఆయన కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పొన్నం ప్రభాకర్ తో పాటు, మరో ఆరుగుగురికి గాయాలయ్యాయి.శనివారం తెల్లవారు జామున వేములవాడ మండలం నాంపల్లి వద్ద ఓ మలుపులో మరోవాహనాన్ని తప్పించబోయి పొన్నం కారు పల్టీ కొట్టింది.

ఆ సమయంలో కారు తక్కువ వేగంతో ప్రయాణిస్తుండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. గాయపడిన పొన్నం మరియు ఇతరులను కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో పొన్నం ప్రభాకర్ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో గాయాల పాలయ్యారని అంటున్నారు. పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నేతగా, పీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.