యురి ఎఫ్ఫెక్ట్ : పాక్ తో క్రికెట్ ఆడం అంటున్న బీసీసీఐ.. ఆడాలి అంటున్న మిస్బా..!

Tuesday, September 27th, 2016, 03:51:06 AM IST

mishba-and-anurag-thakur
పాకిస్థాన్ ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న యురి ఘటన తరువాత బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సంచల ప్రకటన చేశారు. పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేది లేదంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.దీనిపై పాక్ కెప్టెన్ మిస్బావుల్ హాక్ స్పందించారు.క్రికెట్ కు రాజకీయ అంశాలకు ముడి పెట్టవద్దని కోరారు. ప్రజలు ఇండో- పాక్ క్రికెట్ పై ఏమనుకుంటున్నారో తెలియకుండా మాట్లాడితే ఎలా అని అన్నారు. క్రికెట్ తో రాజకీయ అంశాలను ముడి పెట్టవద్దని కోరారు.తాను ఎప్పడూ భారత్ తో క్రికెట్ ఆడాలని కోరుకుంటానని అన్నాడు. ప్రత్యేకంగా భారత్ తో ఆడుతున్నప్పుడు కెప్టెన్ గా ఉండాలని కోరుకుంటానని తెలిపాడు.

క్రికెట్ ను, రాజకీయాలను విడివిడిగా చూడాలని లేకపోతె క్రికెట్ సంబంధాలు కొనసాగడం కష్టమని మిస్బా అన్నాడు.అంతకుముంది పలువురు పాక్ మాజీ క్రికెటర్లు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై స్పందించారు. ఠాకూర్ బీసీసీఐ అధ్యక్షుడా ? లేక రాజకీయ నాయకుడా ? అని ప్రశ్నించారు.