ఏపీ బిగ్ ఎలక్షన్: జగన్ విజయంలో ఆ నలుగురిదే కీలక పాత్ర..!

Tuesday, April 23rd, 2019, 06:43:06 PM IST

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 11వ తేదిన ముగిశాయి. అయితే ఫలితాలకు ఇంకా సమయం ఉన్నా, అన్ని సర్వేలు మాత్రం దాదాపు జగన్ విజయం ఖాయమని తీర్పునిచ్చేశాయి. అయితే గత ఎన్నికలలో కూడా జగన్ గెలుస్తాడనుకున్న స్వల్ఫ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికలలో ఓటమి పాలైనా సహనం కోల్పోకుండా పాదయాత్రలు చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. వారి కష్టాలను అడిగి తెలుసుకుని మరి వారికి నేనున్నానంటూ ధైర్యాన్ని అందించాడు.

అయితే జగన్ చేసిన ఆ పాదయాత్రల ఫలితమో లేక చంద్రబాబు పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వలనో ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకుంటారు అని అటు సర్వే వర్గాలు, ఏపీ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఏది ఏమైనా జగన్ గెలుపు వెనుక ఉన్న వ్యవహారాలన్నిటిని ఒక నలుగురే చక్కదిద్దారు అని తెలుస్తుంది. అయితే అందులో మొదటగా జీవీడీ కృష్ణ మోహన్ ఈయన జగన్ మీడియా వ్యవహారాలను చూసుకుంటూ జగన్ ఏఏ అంశాల మీద ప్రస్తావించాలనే అంశాలు అన్ని ఈయన పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. ఇక రెండో వ్యక్తి తలశిల రఘురాం జగన్ పాదయాత్రలు, పబ్లిక్ మీటింగ్‌లు అన్నీ ఈయనే చూసుకునే వారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ కావడంలో ఈయనదే ముఖ్య పాత్ర. ఇక మూడో వ్యక్తి కేఎన్ఆర్ ఈయన జగన్ వ్యక్తిగత పీఎ, ఈయన జగన్‌కి సంబంధించి అన్ని వ్యవహారాలను చూస్తుంటారు. ఇక నాలుగో వ్యక్తి ట్రంప్ అవినాశ్ ఈయన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ వ్యవహారాలు చూసుకుని, రిపబ్లికన్ డాటా ఎనలిస్ట్‌గా మంచి పేరును సంపాదించుకున్నారు. ఈయన 2014 ఎన్నికలలో జగన్ ప్రచార బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఇంత మంది జగన్ వెనుక నిలబడి ఆయన గెలుపుకు కృషి చేస్తున్నారు.