ఇకనుండి రేషన్ బియ్యం ఎక్కడైనా తీస్కోవచ్చు…

Saturday, March 31st, 2018, 07:17:41 PM IST

ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండలేనివాళ్ళకు తెకంగానా రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడిని కలిగించింది. ఇకనుండి ఉద్యోగం ట్రాన్స్ఫర్లు, పిల్లల చదువులకోసం వలస వెళ్ళే కుటుంబాలు ప్రతీ నెలా రేషన్ బియ్యం పోగొట్టుకునే అవసరం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణలో ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. దేశంలోనే ఇది అతి విప్లవాత్మకమైన కార్యక్రమం అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం మొత్తం 85 లక్షల రేషన్‌కార్డుదారులకు రేపట్నుంచి అందుబాటులోకి రానుంది. వలస వచ్చినవారికి రేషన్ పోర్టబిలిటీ ఉపయోగపడుతుందన్నారు. రేషన్ డీలర్ల కమీషన్ పెంచే ప్రతిపాదన ఉందని సీవీ ఆనంద్ తెలిపారు. ఇక వలస వెళ్ళే బీద కుటుంబాలు రేషన్ కోసం బాధపడనవసరం లేదు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడున్నా మీకు అనుగుణంగా మీ దగ్గరలోని రేషన్ షాపు వద్దకు వెళ్లి రేషన్ తీస్కునేలా అన్ని విధాలా తగిన ప్రక్రియలు పూర్తి చేసాం అన్నారు.