ఉప్పొంగిన లావా.. బూడిదకే బూడిదైన మనిషి!

Wednesday, June 6th, 2018, 12:47:32 AM IST

మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో అగ్ని పర్వతం ఎవరు ఊహించని విధంగా బీభత్సం సృష్టించింది. ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్న సమయంలో ఉవ్వెత్తున ఎగసిపడ్డ లావా మారణ హోమాన్ని తలపించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టించింది. దాదాపు 100 మందికి పైగా మృతికి చెందినట్లు అంతర్జాతీయా మీడియా సంస్థల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు 65 మృతదేహాలు లభ్యమయాయ్యి.

ఇంకా వెతుకులట కోనసాగిస్తున్నారు. కొంత మంది రక్షణ అధికారులు కూడా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. లావా ఒక్కసారిగా ఉప్పొంగడంతో బూడిద మొత్తం పరిసర ప్రాంతలను కమ్మేసింది. వాటి ధాటికి చాలా వరకు ఇల్లు రూపాలు మారిపోయాయి. మనిషి ప్రాణాలు అయితే అర సెకను కూడా నిలవలేదు. గ్వాటెమాలా సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఆదివారం ఒక్కసారిగా లావాను ఎగజిమ్మింది. 45 మందిని రక్షించిన రక్షణ సిబ్బంది ఇంకా చాలా మందిని వెతుకుతున్నారు.

అందులో చాలా వరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారే ఎక్కువ. ప్రభుత్వం మొత్తం అక్కడి జనాలను దురా ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 1974 తర్వాత సంభవించిన అత్యంత ప్రమాదకరమైన విపత్తు ఇదే. సహాయక చర్యలు ఎంత తొందరగా చేస్తున్నప్పటికీ ఇంకా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. వాతావరణం కూడా ఏ మాత్రం అనుకూలించడం లేదు. అక్కడి వేడికి పక్షులతో పాటు పశువులు కూడా మరణిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసిన హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments