ఈ స్మార్ట్ ఫోన్స్ ని చూస్తే కొనెయ్యాలని అనిపిస్తోంది !

Wednesday, February 7th, 2018, 04:09:06 PM IST

గత ఐదేళ్ల నుంచి చూసుకుంటే మొబైల్ రంగం టెక్నాలిజీలో చాలా వరకు అభివృద్ధి చెందిందనే చెప్పాలి. ప్రస్తుతం మొబైల్స్ వాడే వారిలో ఎక్కువగా టచ్ స్క్రీన్ లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మొన్నటి వరకు ఓ సైజ్ వరకు ఉండే స్మార్ట్ ఫోన్స్ డిస్ ప్లే ఇప్పుడు ఫోన్ మొత్తం కనిపిస్తోంది. గత ఏడాది చివర నుంచి ప్రతి కంపెనీ పెద్ద తెరను కలిగిన 18:9 పొడవు, వెడల్పు సైజ్ లో ఉండే.మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో అలాంటి మొబైల్స్ కి డిమాండ్ చాలానే ఉంది.

అయితే పెద్ద తెర వల్ల లాభాలు ఎంతవరకు ఉన్నాయనే విషయంపై ముందుగా అవగాహనా పెంచుకోవాల్సిందే. కొని ఫోన్లను చూస్తుంటే చాలా చిన్నగా అనిపిస్తాయి. కాని అంచుల వరకు డిస్ ప్లే ఉంటుంది. 5.5 ఇంచెస్ తెరలోనే 6.0 అంగుళాల స్క్రీన్‌లు నిక్షిప్తం అవుతున్నాయి. మరికొన్ని మోడల్స్ 5.2 ఇంచెస్ లో 5.7 ఇంచెస్ స్క్రీన్ తో వస్తున్నాయి. 18:9 నిష్పత్తిలో 5 అంగుళాల తెరలోనే ఎక్కువ పొడవుతో 5.5 డిస్‌ప్లే స్క్రీన్‌లు వాడుకలోకి ఎక్కువగా వస్తున్నాయి.
మల్టి టాస్కింగ్ – వర్చువల్‌ రియాలిటీకి పెద్ద తెరలు గల మొబైల్స్ కరెక్ట్ గా సెట్ అవుతాయి.

ప్రస్తుతం మొత్తం స్క్రీన్ తో ఉన్న మొబైల్స్:

*ఐఫోన్ ఎక్స్ 19.5:9

*గెలాక్సీ నోట్ 8 18.5:9

*ఎల్ జి – 18:9

*పిక్సల్ 2 ఎక్స్ ఎల్ 18:9

*వన్ ప్లస్ 5ట్ 18:9

*ఒప్పో ఎఫ్ 5 18:9

*వివో వి7 ప్లస్