ఫ్యూచర్ సిఎం లోకేషేనా..?

Thursday, September 18th, 2014, 01:55:26 AM IST


ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ చేయడం కోసమే ఫార్మర్ వెల్ఫేర్ కార్పోరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. రైతుల రుణమాఫీ విషయంలో రిజర్వ్ బ్యాంక్, కేంద్రప్రభుత్వం సహకరించలేదని కాబట్టే.. ఈ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయవలసి వచ్చిందని.. పుల్లారావు తెలియజేసారు. కార్పోరేషన్ ను సెక్యురటైజ్ చేస్తున్నామని.. ఇరవై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని.. కాబట్టీ.. పదేళ్ళ వరకు సెక్యురటైజ్ చేస్తున్నామని ఆయన అన్నారు. కార్పోరేషన్ ను సెక్యురటైజ్ చేసి రుణమాఫీ కోసం నిధులు సమీకరిస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు తరువాత ఆంధ్రప్రదేశ్ కు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని వ్యవసాయశాఖ మంత్రి జోస్యం చెప్పారు. లోకేష్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్నీ వున్నాయని తప్పకుండ లోకేష్ సిఎం అవుతారని.. ఇకపై రాష్ట్రం అన్ని రంగాలలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని పత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు.