పార్టీ పెట్టడం పక్కా.. గద్దర్ సవాల్ సాధ్యమేనా?

Tuesday, July 24th, 2018, 03:45:21 AM IST

తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ నిత్యం పాటలతో ప్రజల్ని ఉత్తేజపరుస్తుంటారని అందరికి తెలిసిన విషయమే. అయితే ఆయన రాజకీయాల్లోకి రానున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని పలు మీడియా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు గద్దర్ సొంతంగా పార్టీ స్థాపించేందుకు సిద్ధపడుతున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన గద్దర్‌ అభిమానుల ఇష్టాగోష్టి కార్యక్రమంలో గద్దర్ ఈ విషయాన్ని తెలిపారు.

ఏడు పదుల వయసు దగ్గరపడుతున్నప్పటికీ ఓటు హక్కు లేదని పార్టీ పెట్టాలంటే ఓటు హక్కు ఉండాలి కాబట్టి సోమవారం ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఓటు కూడా ఒక పోరాట రూపం అని తెలిసిందని ప్రజాస్వామ్యంలో గెలిచేది ఓడేది రాజకీయనాయకులు కాదని ప్రజలేనని వివరించారు. ఇక తెలంగాణాలో ప్రస్తుతం టీఆరెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ ఇంకా కుదురుకోవాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చెప్పడం కష్టం. మరోవైపు కోదండరాం పార్టీని బలోపేతం చేసుకుంటున్నాడు. మరి వచ్చే ఎన్నికల సమరంలో పార్టీ పెడతానంటున్న గద్దర్ ఎలాంటి దారిని ఎంచుకుంటారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments