కెసిఆర్ పైన పోటీ చేస్తా – గద్దర్..!

Saturday, November 10th, 2018, 04:57:22 PM IST

ప్రజాగాయకుడు గద్దర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు, కెసిఆర్ పైన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించి తన హుందా తనాన్ని, పరిపక్వతను చాటుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీ ని కలిసిన గద్దర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా అని ప్రాకేతించటమే కాకుండా, కాంగ్రెస్ నుండి మద్దతు ఇస్తాం అన్న హామీ కూడా సంపాదించగలిగారు.

గజ్వేల్ లో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తాను స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేయాలనీ నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గజ్వేల్ లో కెసిఆర్ వర్సెస్ వంటేరు ప్రతాప్ రెడ్డి గా సాగుతున్న వాతావరణం లో తాను అసంబద్ధంగా దూరబోనని తెలిపారు గద్దర్. ఈ నేపథ్యంలో గద్దర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తమ మద్దతు తెలపటానికి కాంగ్రెస్ సుముఖత చూపినట్టు తెలుస్తుంది. నొప్పింపక తానొవ్వక అన్నట్టు తన కార్యాన్ని చక్కబెట్టుకున్నారు గద్దర్. గద్దర్ నిర్ణయం తో ప్రతాప్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. గద్దర్ తనను అన్ని పార్టీలు ప్రజలతో మాటాడి ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని కోరారు. ఈ నేపథ్యం లోనే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ని కలిశారు, ఆ తర్వాత కొన్ని రోజులు మౌనం పాటించిన గద్దర్ తాజాగా తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు ప్రకటించారు.

  •  
  •  
  •  
  •  

Comments