గ‌ద్ద‌ర్ ఓట‌ర్ అవ‌గాహ‌న వెన‌కున్న‌ ప్లానేంటీ?

Tuesday, October 9th, 2018, 02:57:04 PM IST

పొడుస్తున్న పొద్దుమీద న‌డుస్తున్న కాల‌మా.. వీర తెలంగాణ మా .. అంటూ తెలంగాణ ఉద్య‌మాన్ని త‌న పాట‌తో ఉర‌కలెత్తించిన ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్‌. ఇన్నేళ్ల ఉద్య‌మ జీవితంలో ఎప్పుడూ ఎన్నిక‌ల‌ను స‌పోర్ట్ చేయ‌ని గ‌ద్ద‌ర్ తాజాగా కొత్త ప‌ల్ల‌వి అందుకున్నాడు. ఓట‌రుగా తొలిసారి త‌న ఓటుహ‌క్కును న‌మోదు చేసుకున్న ఆయ‌న ఓటు హ‌క్కు వినియోగంపై రాష్ట్ర‌మంత‌టా తిరిగి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తాన‌ని ఇందుకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతున్నాడు.

ఇంతేనా అవ‌స‌ర‌మైలే సంగారెడ్డిలోని గ‌జ్వేల్ నుంచి ప్ర‌జ‌ల ఆశీర్వాదం వుంటే పోటీ చేస్తాన‌ని తేల్చి చెప్పాడు. తెలంగాణ 31 జిల్లాల్లోని నియోజ‌క వ‌ర్గాల్లో మీట్ ద ప్రెస్ నిర్వ‌హించి ఓటు విలువ‌ను తెలియ‌జేస్తాన‌ని అంటున్నాడు. ఓట‌రుగా న‌మోదు చేసుకోవ‌డ‌మే త‌న ఇన్నేళ్ల జీవితంలో పెద్ద మార్ప‌ని కొత్త ప‌ల్ల‌వి అందుకున్నాడు. ప్ర‌జ‌లు స్వేచ్చ‌గా ఓటు వేస్తే దేశంలో 25 శాతం ప్ర‌జాస్వామ్యం బ‌తికి వున్న‌ట్టే అని అభిప్రాయ‌ప‌డ్డాడు. రాష్ట్రంలో డ‌బుల్ బెడ్ రూమ్, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, విధ్యార్థుల‌కు కేజీ టు పీజీ విద్య, అంద‌రికి ఆరోగ్యం, నిరుద్యోగుల‌కు ల‌క్ష కొలువులు వ‌చ్చాయా? లేదా అనే అంశాల‌ను చైత‌న్య యాత్ర‌లో ప్ర‌శ్నిస్తాన‌న్నాడు.

ఉన్న‌ట్టుండి గ‌ద్ద‌ర్ ఇలా మార‌డం…ఓట‌ర్ ఆవ‌గాహ‌న అంటూ కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకోవ‌డం వెన‌క వున్న ప్లానేంట‌నేది అధికార, విప‌క్షాల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఓట‌ర్ అవ‌గాహ‌న‌ను గ‌ద్ద‌ర్ నిజంగానే క‌ల్పిస్తాడా? లేక దీన్ని అడ్డుపెట్టుకుని త‌న ప్ర‌చారం మొద‌లుపెడ‌తాడా? అని రాజ‌కీయ విశ్లేశ‌కులు అనుమానిస్తున్నారు. గ‌ద్ద‌ర్ ఓల‌ర్ చైత‌న్య యాత్ర చేస్తే దాని ప్ర‌భావం ఎకు్క‌వ‌గా ప‌డేది అధిక‌ర టీఆర్ ఎస్ పార్టీకే.