గాలి రివెంజ్ బాగానే వర్కౌట్ అయ్యింది!

Tuesday, May 15th, 2018, 04:04:58 PM IST

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న కర్ణాటక ఎన్నికల్లో ఎవరు ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కాంగ్రెస్ బాగానే కాపాడుకున్న కొన్నిట్లో దారుణమైన అపజయాలను చూడాల్సి వచ్చింది. దీంతో భాజపా ఆ స్థానాలను గెలుచుకుంది. ఎన్నికల ఫలితాల విషయం గురించి పక్కనపెడితే అందరిని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. గాలి బ్రదర్స్ వర్సెస్ సిద్దరామయ్య ఫైట్ బలే కిక్కు ఇచ్చిందనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి.

ఎందుకంటే గాలి జనార్దన్ వర్గానికి సీఎం సిద్దరామయ్య ప్రభుత్వానికి మధ్య ఆగ్రహ జ్వాలలు చాలా పెద్దగా ఉన్నాయి. 2010 కర్ణాటక అసెంబ్లీలో చర్చలు జరుగుతుండగా ప్రతి పక్ష పార్టీలో ఉన్న సిద్దరామయ్య మైనింగ్ విషయంలో గాలిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పుడున్న గాలి వర్గం వారు సిద్దరామయ్యపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు.దమ్ముంటే బళ్లారిలో అడుగుపెట్టి చూడు. చంపేస్తాం అనే స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు.

అయితే సిద్దరామయ్య ఏ మాత్రం భయపడకుండా అప్పుడు బళ్లారిలోనే పాదయాత్ర చేసి తన మద్దతును పెంచుకున్నారు. ఆ తరువాత 50 కోట్ల మైనింగ్ కుంభకోణం కేసులో బళ్లారి బ్రదర్స్ ను నాలుగేళ్లు జైల్లో పెట్టారు. ఆ తరువాత యడ్యూరప్ప సీఎం సీటు నుంచి తప్పుకోవలసి వచ్చింది. రెండేళ్ల అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దరామయ్య గెలిచి మైనింగ్ కేసులో గాలి సోదరులను మరోసారి జైలు మెట్లెక్కారు. ఇక ఈ సారి ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని గాలి జనార్దన్ రెడ్డి బిజెపితో చేతులు కలిపి ఏడూ స్థానాల్లో కాంగ్రెస్ కు పోటీగా తన బలగాన్ని దింపాడు. గాలి తన తమ్ముళ్లను రంగంలోకి దింపగా వారు ఇప్పుడు పోటీపడిన స్థానాల్లో విజయం సాధించి సిద్దరామయ్య పై రివెంజ్ తీర్చుకున్నారు.