పారిశ్రామిక రాయితీలు ఇవ్వాల్సిందే : ఎంపీ గల్లా జయదేవ్

Friday, August 10th, 2018, 08:30:20 AM IST

ఎన్ని పోరాటాలు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్రం ఏ మాత్రం జాలి చూపడం లేదు. అలాగే ప్రత్యేక హోదా కోసం తెలుగు దేశం పార్టీ సైతం తన పోరాటాన్ని ఏ మాత్రం ఆపడం లేదు. పార్లమెంట్ లో ఎంపీలు ఇంకా కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరిపై వ్యతిరేకతను తెలియజేస్తూనే ఉన్నారు. ఇక టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ అంశాలను తెలుపుతూ.. దేశానికి అండగా నిలుస్తున్న కేంద్రం వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని లోక్ సభలో సూచించారు.

“మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా పారిశ్రామిక రాయితీలు ఇచ్చి తీరాలి. రాష్ట్ర విభజన చేసి ఏపీని సంక్షోభంలోకి నెట్టేశారు. ఈశాన్య రాష్ట్రాలకు ఎలాగైతే రాయితీలు ఇస్తున్నారో ఏపి కి కూడా అదే తరహాలో అమలు చేయాలి. ముఖ్యంగా రాష్ట్రం జీఎస్టీ కారణంగా ఏడాదికి 2600 కోట్ల రూపాయల వరకు నష్టపోతోంది. కేంద్రం కొంత నష్టాన్ని భర్తీ చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు” అని జయదేవ్ వివిధ అంశాల గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

  •  
  •  
  •  
  •  

Comments