పవన్ – జగన్.. ఎందుకు ప్రశ్నించడం లేదు : గల్లా జయదేవ్

Saturday, April 28th, 2018, 02:35:27 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని విధమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువగా రాజకీయ విభేదాలతోనే ప్రస్తుతం నాయకులంతా సతమతమవుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ – తెలుగు దేశం పార్టీ మధ్య విబేధాలు రావడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతం పవన్ టీడీపీ పై చేస్తోన్న విమర్శలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ తీరుపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. అలాగే జగన్ పై కూడా కొన్ని కామెంట్స్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ సినిమాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ ఒత్తిడి పెంచేతుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తగ్గిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ జగన్ ఆ విషయంపై మోడీ ని ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. పవన్, జగన్ కుట్ర రాజకీయాలని హోదా కోసం ఎన్డీయే నుంచి టీడీపీనే బయటకు వచ్చినప్పటికీ పవన్ ఎందుకు రావడం లేదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం చిత్త శుద్దితో పోరాటం చేయాలనీ చెప్పిన జయదేవ్ కుట్ర రాజకీయాలను మానుకోవాలని మాట్లాడారు.

  •  
  •  
  •  
  •  

Comments