ముగ్గురు మిత్రులు సినిమా త్వరలో విడుదల.. గల్లా షాకింగ్ ట్వీట్

Thursday, April 26th, 2018, 11:16:17 AM IST

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్, గవర్నర్ వ్యవహారంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పవన్ నేరుగా చంద్రబాబు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో… టీడీపీ నుంచి కూడా కౌంటర్లు మొదలయ్యాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పవన్, జగన్‌లపై సెటైర్లు వేయగా… మరో ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది.

పవన్ కల్యాణ్, జగన్ సినిమా త్వరలో విడుదల కాబోతోందని, దీనికి ప్రశాంత్ కిషోర్ స్టోరీ, డైరెక్షన్ అని గల్లా ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల నిర్మాణ సారథ్యంలోనే ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోందని ఆయన ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ఇటీవల ట్వీట్ల ద్వారా టీడీపీని ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అందుకే ట్వీట్ ద్వారానే గల్లా తన స్టయిల్ లో పవన్,జగన్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

గల్లా జయదేవ్ 2014 ఎన్నికల సమయానికి సూపర్ స్టార్ కృష్ణ గారికి అల్లుడు, మహేష్ బాబు కి బావ అని మాత్రమె తెలుసు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా, రాజకీయాలకి కొత్త అయినా గల్లా మొట్టమొదటి సారి గుంటూరు నుంచి ఎంపి గా పోటి చేసి ఊహించని మెజారిటి తో గెలిచారు. ఆ తర్వాత పార్లమెంట్‌లో మోడీ, జైట్లీ లను నిలదీయడం ద్వారా దేశం మొత్తం ఆయన పేరు మారుమోగిపోయింది.అటువంటి గల్లాతన సోషల్ మీడియా ఖాతా ద్వారామరొక సంచలన పోస్ట్ పెట్టారు. ఇన్నాళ్ళు గాసిప్‌గా ఉన్న ఈ వార్తను ఇప్పుడు ఆయన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయ‌డంతో ఒక్క‌సారి రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments