రోహిత్ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది – గంగూలీ !

Sunday, September 30th, 2018, 06:41:25 PM IST

ఆసియా కప్ తరువాత క్రికెట్ అభిమానుల చూపు వెస్టిండీస్ తో జరిగే సిరీస్ ఫై పడింది. అక్టోబర్ 4నుండి ప్రారంభం కానున్న ఈ టెస్ట్ సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. ఈజాబితాలో ఆసియా కప్ కు కెప్టెన్ గా వ్యవహరించి కప్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆటగాడు రోహిత్ శర్మ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందంటున్నాడు భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.

రోహిత్‌ నీ సారథ్యంలో ఆసియాకప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయినా వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కు నిన్ను ఎంపిక చేయలేదు. ఈ జట్టులో నీపేరు లేకపోవడం చూసి నేను ఆశ్చర్యానికి గురయ్యా అని గంగూలీ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇక ఆసియా కప్ లో రోహిత్ తో పాటు ఓపెనర్ గా రాణించిన శిఖర్ ధావన్ ను కూడా జట్టులోనుంచి తప్పించారు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టు తో జరిగిన టెస్ట్ సిరీస్ లో శిఖర్ రాణించకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments