స్మిత్ మోసగాడు కాదు.. మళ్లీ వాళ్లు వస్తారు: సౌరవ్ గంగూలీ

Thursday, April 5th, 2018, 11:32:11 AM IST

ఇటీవల జరిగిన బాల్ టాంపరింగ్ వివాదంలో స్మిత్‌, వార్నర్‌ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ నుంచి కూడా దూరమవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ ఘటన సంచలనం సృష్టించింది. అలాగే బాన్‌క్రాఫ్ట్‌ కూడా నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లపై తీసుకున్న నిర్ణయం కొంత మందికి నచ్చినప్పటికీ మరికొంత మంది సీనియర్ క్రికెటర్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎక్కువగా వారిపై సానుభూతి చూపించారు .

ఇక రీసెంట్ గా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై సానుభూతిని వ్యక్తం చేశాడు. స్మిత్ గురించి మాట్లాడుతూ.. స్మిత్ మోసగాడు కాదు. అతనిపై నాకు సానుభూతి ఉంది. అలాగే వాళ్లు ముగ్గురు మళ్లీ తిరిగి జట్టులోకి వస్తారని వారిపై సానుభూతి ఉందని చెప్పాడు. అలాగే వాళ్లు మోసం చేశారు అనడం కరెక్ట్ కాదని చెబుతూ.. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో గంగూలీ తన అభిప్రాయాన్ని వివరించాడు.

  •  
  •  
  •  
  •  

Comments