వై ఎస్ జగన్ పై గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..!

Sunday, September 16th, 2018, 06:08:04 PM IST

ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మరో సారి ప్రతిపక్ష నేత అయిన వై ఎస్ జగన్ మీద మండిపడ్డారు. వై ఎస్ జగన్ తన మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. భూకుంభకోణ ఆరోపణల విషయం లో తాను వై ఎస్ జగన్ మరియు వారి పార్టీ సభ్యులు ఎవరితో అయినా సరే ఎక్కడ అయినా సరే చర్చకు సిద్ధం అని, ఒకవేళ తాను అవినీతి చేయని పక్షం లో వారు ఏమి చేస్తారో తెలపాలి అని సెలవిచ్చారు.

అయితే అవినీతి కేసుల్లో ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లే జగన్ ఎదుటి వారి మీద అవినీతి ఆరోపణలు చేయడం అన్యాయమని సూచించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు గార్లు నిర్విరామంగా పాదయాత్రలు చేసి సీఎం అయ్యారని ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లి పాద యాత్ర చేసే వ్యక్తి కేవలం జగనే అని ఇదంతా చాలా వింతగా ఉంది అని ఈ రోజు విశాఖపట్నం లోని ఆస్వార్ దాస్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరు అవ్వగా తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments