మోడీని ప్రశ్నించే దమ్ము జగన్,పవన్ లకి లేదు..గంటా సంచలన వ్యాఖ్యలు.!

Monday, October 1st, 2018, 12:00:05 PM IST

2018 పూర్తయ్యి 2019 వస్తుంది.ఒక పక్క తెలంగాణా ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లలో రాజకీయ వేడి ఇప్పటికే మొదలయ్యింది,సమయం కూడా దగ్గర పడుతుంది.తెలంగాణా సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి మాత్రం గెలుపు ఎవరిదీ అనేది అన్న ప్రశ్న వస్తే కాసేపు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.ఇదే సమయంలో ఇప్పటికే బీజేపీతో విభేదించిన టీడీపీ నాయకులు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.వీరిపై టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం వై ఎస్ జగన్ విశాఖ జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నారు కదా ఇన్ని రోజులు అక్కడే పాదయాత్ర కొనసాగిస్తున్నపుడు,విశాఖకు రావాల్సిన రైల్వే జోన్ కోసం నరేంద్ర మోడీని నిలదీసే దమ్ము నీకు లేదని ప్రశ్నించారు.అదే సమయంలో పవన్ పై కూడా తాను కేవలం ఎప్పుడు టీడీపీనే ఎందుకు ప్రశ్నిస్తున్నారని,కేంద్ర ప్రభుత్వంను ఎందుకని ప్రశ్నించడం లేదని అడిగారు,దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన రాఫెల్ కుంభకోణంపై వీరు ఇద్దరు ఎందుకని ప్రశ్నించడం లేదని,జగన్,పవన్ లు మోడీ అనే రెండు అక్షారాలకు భయపడుతున్నారని అందుకే ఆయన్ని నిలదీసే దమ్ము వీళ్ళకి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.