గ్యాస్ లీక్స్‌తో స్మార్ట్ సిటీల‌కు డేంజ‌ర్‌ అలార్మ్‌!

Friday, September 14th, 2018, 09:40:05 PM IST


స్మార్ట్ సిటీపేరుతో న‌గ‌రాల్లో అండ‌ర్ గ్రౌండ్ ద్వారా, పైప్ లైన్లు వేసి క‌రెంటు, పెట్రోలు, గ్యాస్ వంటి వాటిని అందించేందుకు ఇండియాలో ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. అన్ని స్మార్ట్ సిటీల్లో పైప్ లైన్ల‌ ద్వారానే గ్యాస్ ఇళ్ల‌కు చేరుతుంది. వంట గ్యాస్‌ను కుళాయి విప్పుకున్న‌ట్టు విప్పుకోవ‌డ‌మే ఇక‌. అయితే ఈ పంపిణీ వ్య‌వ‌స్థ స‌రిగా లేక‌పోతే ఆ ప‌రిణామం ఎలా ఉంటుందో నిన్న అమెరికాల- మ‌సాచు సెట్స్‌లో చోటు చేసుకున్న భారీ ప్ర‌మాదాన్ని ఓ ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. గురువారం ఉద‌యం మ‌సాచుసెట్స్ రాష్ట్రం మెర్రిమాక్ వ్యాలీ-అండోవ‌ర్ ప‌ట్ట‌ణంలోని ఇళ్ల‌లో భారీ పేలుళ్లు సంభ‌వించాయి. అదృష్ట‌వ‌శాత్తూ ప్రాణాపాయం క‌ల‌గ‌లేదు కానీ, ఇది అతి దారుణ‌మైన పేలుడు అని అగ్నిమాప‌క ద‌ళాలు చెబుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు గాయపడ్డార‌ని తెలుస్తోంది.

అయితే ఈ ప్ర‌మాదం ఎందుకు సంభ‌వించింది? అంటే గొలుసు క‌ట్టుగా ఉండే పైప్ లైన్‌లో ఓ చిన్న‌ లీకేజీ వ‌ల్ల విస్పోట‌నం సంభ‌వించింది. అది ఒక ఏరియాలోని అన్ని ఇళ్ల‌ను చుట్టు ముట్టేసింది. దాదాపు 70 ఇళ్ల‌లో ఒకేసారి ఉన్న పెట్టున భీక‌ర శ‌బ్ధాల‌తో మంట‌లు చెల‌రేగాయి. ఆ వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంధి మంట‌లు ఆర్పేందుకు బ‌రిలో దిగ‌క‌పోతే ఇంకా పెను ప్ర‌మాద‌మే జ‌రిగేది. ఈ మంట‌ల్ని అదుపులోకి తెచ్చేందుకు 50 ఫైరింజన్లు, 10 అంబులెన్స్ లు నిరంత‌రాయంగా ప‌ని చేశాయి.. 38 చోట్ల మంటల్ని అదుపులోకి తేగ‌లిగారు. జీవితంలోనే ఇలాంటి అగ్నిప్రమాదాన్ని తాము చూడలేదని అధికారులు చెబుతున్నారు. గ్యాస్ పేలుళ్లు ఒక వార్ జోన్‌ని త‌ల‌పించాయ‌ని పోలీస్ చెబుతున్నారు. ఇక‌పోతే ఈ ప్ర‌మాదాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే స్మార్ట్ సిటీల‌కు గ్యాస్ అనుసంధానం ఎంత ప్ర‌మాద‌మో ఊహించ‌వ‌చ్చు. ఇక అమెరికాలాంటి చోట అంత అలెర్టుగా వ్య‌వ‌స్థ ప‌ని చేసే చోట అలాంటి ప్ర‌మాదం జ‌రిగింది. ఇక మ‌న ఇండియాలో అయితే ఊహించ‌లేమ‌న్న వాద‌నా వినిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments