వారిని దేశంలో అడుగుపెట్టనివ్వకూడదు: గౌతమ్ గంభీర్

Friday, April 27th, 2018, 02:20:17 PM IST

టీమ్ ఇండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఒక క్రికెటర్ గానే కాకుండా ఒక మంచి భారత పౌరుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సైనికులంటే గంభీర్ కు ఎనలేని గౌరవం. సైనికుల పై దాడులు జరిగితే వెంటనే స్పందిస్తుంటాడు. అమిత దేశభకక్తి కలిగిన ఈ క్రికెటర్ ఎన్నో సైనికుల కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేశాడు. ఇకపోతే రీసెంట్ గా గంభీర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పాకిస్థానీయులను ఎవ్వరిని ఇండియాలో అడుగు పెట్టనివ్వ కూడదని గంభీర్ చెప్పాడు.

ఒక్క క్రికెట్ లోనే కాకుండా.. సినిమాలు సంగీతం.. ఇలా ఏ విషయాల్లోను ఆ దేశంతో సంబంధాలు ఉండవద్దని బార్డర్ లో మాన సైనికులను చంపుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంబీర్ తెలిపారు. అలాగే ప్రభుత్వాల్లో శాంతి చర్చలని చెబుతున్నా వారి ఆగడాలు ఆగడం లేదన్నారు. చర్చలు జరిపినట్టే జరిపి.. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సైనికుల ప్రాణాలను తీస్తే ఉపేక్షించేది లేదు. వారికి కఠిన చర్యలే సరైన సమాధానం. దాడి చేసినప్పుడు పాక్ రేంజర్లను చంపడంలో తప్పు లేదు. విషయం ఓ కొలిక్కి వచ్చే వరకు పాకిస్థానీయులను దూరం పెట్టడమే మంచిదని గంబీర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గంబీర్ 2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన జవానులు పిల్లలను చదివిస్తున్నాడు. గురువారం రాత్రి వారితో డిన్నర్ లో పాల్గొన్నాడు.