వైరల్ స్టోరీ : యూట్యూబ్ సాయంతో పిల్లాడికి జన్మనిచ్చిన తల్లి

Saturday, April 28th, 2018, 02:35:31 AM IST

ఓ మహిళగా తాను తల్లి అవడం కంటే అదృష్టం ఇంకేమీ ఉండదని అనుకుంటుంది. తల్లి అవడమంటే మరో జన్మ ఎత్తినట్లే. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాని పిల్లలకు జన్మనిచ్చే అదృష్టం రాదని పెద్దలు అంటుంటారు. మరి.. తల్లిగా ఓ బిడ్డకు జన్మనిచ్చే క్షణాలు ఎలా ఉండాలి. ఆ క్షణాలను గుర్తు తెచ్చుకొని జీవితాంతం సంతోషంగా గడపాలి కాని.. జీవితాంతం బాధ పడుతూ కుమిలిపోకూడదు. అయితే.. ఓ మహిళ మాత్రం ఓ తల్లిగా ఇటువంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని చెబుతున్నది. అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి..

మహిళ పేరు టియా ఫ్రీమాన్. వయసు 22 ఏండ్లు. పెండ్లి అయింది. తనకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఐదారు నెలల ముందే ప్లాన్ చేసుకుంటుంది. టికెట్లు బుక్ చేసుకుంటుంది. ఒంటరిగానే ప్రపంచమంతా చుట్టేస్తుంది. అయితే.. గత జనవరిలోనే తను మూడు నెలల ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నది. కాని.. అప్పటికే మార్చిలో జర్మనీకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నది. టికెట్లు కూడా బుక్ చేసుకున్నది. కాని.. ప్రెగ్నెన్సీ తన ప్రయాణాన్ని ఆపేస్తుందేమోనని టెన్షన్ పడింది. కాని.. ఇంటర్నేషనల్ ఫ్లయిట్ టికెట్ చాలా ఖరీదు కదా. అందుకే.. తన ప్రయాణాన్ని వాయిదా వేసుకోలేదు.

డెలివరీ సమయానికి తన ప్రయాణాన్ని ముగించుకొని రావచ్చని అనుకున్నది. కాని.. తీరా జర్మనీకి బయలు దేరిన తర్వాత అంతా రివర్స్ అయింది. విమానంలోనే కొంచెం తిమ్మిర్లు వచ్చినట్లు అయింది. అన్‌ఈజీగా ఉంది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు టియాకు. ఇక.. మధ్యలో టర్కీలోని ఇస్తాంబుల్‌లో దిగిన టియా.. జర్మనీకి బయలుదేరాల్సిన విమానానికి చాలా సమయం ఉండటంతో హోటల్‌కు బయలుదేరింది. హోటల్ రూమ్‌కు వెళ్లగానే తనకు నొప్పులు స్టార్టయ్యాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని టియా.. ఎవరినీ పిలవలేకపోయింది. దీంతో వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి డెలివరీ ఎలా చేయాలో వాటి వీడియోలను చూసి సేమ్ అలాగే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఇక.. తాను యూట్యూబ్ సాయంతో బిడ్డకు ఎలా జన్మనిచ్చిందో అన్నీ వివరంగా రాసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో తన స్టోరీ కాస్త సోషల్ మీడియాలో వైరలయింది. అంతే కాదు.. నెటిజన్లు తన సాహసం, దైర్యం, తెగింపును చూసి తెగ మెచ్చుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments