30 ఇయ‌ర్స్ పృథ్వీ గ‌వ్వ‌లపురాణం

Thursday, November 8th, 2018, 09:21:18 AM IST

గ‌త కొంత కాలంగా ద‌క్షిణాదిపై బీజేపీ శ్రేణులు ఆప‌రేష‌న్ గ‌రుడు పేరుతో అస్థిర‌త‌ను కుట్ర ప‌న్నుతున్నార‌ని, ఏపీ సీఎంను గ‌ద్దెదించ‌డంలో భాగంగా అల‌జ‌డుల‌కు పూనుకుంటార‌ని బోర్డ్‌పై లెక్క‌లు వేస్తే హీరో శివాజీ పెద్ద లెక్చ‌రే దంచాడు. దీనికి 30 ఇయ‌ర్స్ పృథ్వీ తాజాగా కౌంట‌రిచ్చాడు. శివాజీ ఆరోపిస్తున్న ఆప‌రేష‌న్ గ‌రుడ‌ను కామేడీగా కొట్టిపారేసిన పృథ్వీ త్వ‌ర‌లో తాను `గ‌వ్వ‌ల పురాణం` రిలీజ్ చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

శివాజీతో పాటు టీడీపీ శ్రేణులు ప‌క్కా స్కెచ్‌తో ఆప‌రేష‌న్ గ‌రుడు అంటూ గ‌రుడ పురాణం రాశారు. అయితే దానికి విరుగుడుగా నేను `గ‌వ్వ‌ల పురాణం` రాస్తున్నాను. ఇందులో విచిత్రం ఏమిటంటే గ‌వ్వ‌ల‌న్నీ వాటంత‌ట అవే వ‌చ్చిప‌డ‌తాయి. ఒక్కోగ‌వ్వ ఒక్కో రాజ‌కీయ‌నాయ‌కుడ‌న్న‌మాట‌. ఒక్కో గ‌వ్వ ఎగిరొచ్చి బ‌య‌ట‌ప‌డిందంటే టీడీపీ నాయ‌కుల‌ జాత‌కం బ‌య‌ట‌ప‌డిన‌ట్టే. దీన్ని డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తాం. టీడీపీ వాళ్లు గ‌రుడ పురాణం అంటే త‌ప్పులేన‌ప్పుడు మేం `గ‌వ్వ‌ల పురాణం` అంటే త‌ప్పేముంది. జ‌నాలు ఆశిస్తున్న‌ట్టు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో హంగులు, బొంగులు అంటూ ఏమీరావు. గెలుపు కోసం అడ్డ‌మైన స‌మీక‌ర‌ణాలు, అక్ర‌మ పొత్తులు లాంటి వ్య‌వ‌హారాలు ఏవీ వైసీపీలో వుండ‌వు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార్ వ‌న్‌సైడే.. ప్ర‌జా తీర్పు జ‌గ‌న్‌కే. టీడీపీని మ‌ట్టిక‌రిపించి వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. కావాలంటే `గ‌వ్వ‌ల పురాణం` మీద ఒట్టు అని తేల్చేశాడు పృథ్వీ.