ట్రైలర్ టాక్ : గాయత్రి..డైలాగ్ కింగ్ విశ్వరూపం..!

Sunday, January 28th, 2018, 08:30:58 PM IST


చాలా కాలం తరువాత సీనియర్ హీరో మోహన్ బాబు తన నట విశ్వరూపం ప్రదర్శించారు. డైలాగ్ కింగ్ అనే తన బిరుదుని సార్థకం చేస్తూ పంచ్ డైలాగులతో చెలరేగిపోయారు. మోహన్ బాబు, మంచు విష్ణు మరియు శ్రీయ కీలక పాత్రల్లో నటించిన గాయత్రి చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలయింది. ‘రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది..భారతం ఒక ఆడదాని నవ్వు వలన జరిగింది’ అంటూ మోహన్ బాబు పదునైన డైలాగులతో ఆకట్టుకుంటున్నారు.

దాదాపు రెండున్నర నిమిషం నిడివి ఉన్న ట్రైలర్ మోహన్ బాబు డైలాగులతో చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. నేను వెయ్యరని పాత్ర వేస్తున్నానో చెయ్యరని తప్పు చేస్తున్నానో అర్థం కావడం లేదు అంటూ విష్ణు చెబుతున్న డైలాగ్ కూడా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ”ఈ గాయత్రి పటేల్ ప్రతి పేజీ క్రైం పేజిరా” అంటూ మోహన్ బాబు చెప్పే డైలాగ్ మునుపటి డైలాగ్ కింగ్ ని గుర్తు చేస్తోంది. మోహన్ బాబు పూర్తి విశ్వరూపం చూడాలంటె ఫిబ్రవరి 9 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి మదన్ రామిగాని దర్శకుడు.