గేల్ కామ కలాపం : కోర్టులో సంచలనాలు వెల్లడించిన మసాజ్ థెరపిస్టు !

Wednesday, October 25th, 2017, 06:16:46 PM IST

స్టార్ క్రికెటర్, విండీస్ విధ్వంసక వీరుడు కామంతో చేసిన పైశాచిక పనులు బయట పడ్డాయి. ఆస్ట్రేలియాలో జరిగిన 2015 ప్రపంచ కప్ సందర్భంగా లేడి మసాజ్ థెరపిస్టు అయిన లీనా రస్సెల్ తో గేల్ అసభ్యంగా ప్రవర్తించడం సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసు సిడ్నీ కోర్టులో విచారణకు వచ్చినట్లు ఆస్ట్రేలియా మీడియా వ్యాఖ్యానించింది. గేల్ పై లీనా సంచలన ఆరోపణలు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.

విండీస్ జట్టుకు లీనా మసాజ్ థెరపిస్టు గా పనిచేసింది . గేల్ తనకు మర్మాంగాన్ని చూపి అసభ్యంగా ప్రవర్తించడంతో వెక్కి వెక్కి ఏడ్చి వేదనకు గురయ్యానని లీనా కోర్టు ముందు తెలిపింది. డ్రెస్సింగ్ రూమ్ లో ఎవరూలేని సమయంలో గేల్ అలా ప్రవర్తించాడని లీనా ఆరోపించింది. లీనా ఆరోపణలపై గేల్ గతంలోనే స్పదించి పరువు నష్టం దావా వేశాడు. తమని నాశనం చేయడానికే ఆమె ఇలా ప్రచారం చేస్తోందని గేల్ అన్నాడు. ఆ సమయంలో తనతో పాటు డ్వేన్ స్మిత్ కూడా ఉన్నాడని తెలిపాడు. లీనా ఆరోపణల్ని స్మిత్ కూడా ఖండించాడు. టవల్ కోసం తాను డ్రెస్ ఛేంజింగ్ రూమ్ కి వెళ్లగా.. ఏం వెతుకుతున్నావ్ అంటూ గేల్ తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి.. ఏడ్చుకుంటూ తాను బయటకు వచ్చేశానని లీనా కోర్టు ముందు గోడు వెల్లబోసుకుంది. ఈ తతంగం జరగక ముందు లీనా కు సెక్సీ అని మెస్సేజ్ పెట్టినట్లు స్మిత్ ఒప్పుకున్నాడు.