దేవరకొండ సరికొత్త రికార్డ్..!

Friday, November 16th, 2018, 03:00:47 AM IST

పెళ్లి చుపూలు లాంటి హిట్ తో ఫస్ట్ సినిమాతో నే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ, తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు, ఒక రకంగా చెప్పాలంటే యూత్ ఐకాన్ గా ఎదిగాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉండటంతో ఆ సినిమా కు ఫామిలీ ప్రేక్షకులు దూరంగా ఉన్నారు. విజయ్ కి మాత్రం ఎవరూ ఊహించని క్రేజ్ ను తెచ్చి పెట్టింది అర్జున్ రెడ్డి సినిమా.

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ కి మాత్రమే పరిమితమైన విజయ్, తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమాతో ఫామిలీ ప్రేక్షకులకు సైతం చేరువయ్యాడు. ఆ సినిమా ఏకంగా 70కోట్ల షేర్ ను రాబట్టి విజయ్ ని స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. తాజాగా గీతా గోవిందం సినిమా ఇంకో కొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ మధ్య జీ తెలుగులో ప్రసారం అయిన ఆ సినిమాకు ఏకంగా 20.7 టీవీ వ్యూయర్షిప్ రేటింగ్ వచ్చింది. ఇదేమి ఆషామాషీ రేటింగ్ కాదు, రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం కంటే ఎక్కువ. రంగస్థలం సినిమాను స్టార్ మా వారు ప్రసారం చేయగా ఆ సినిమాకు 19.5 TVR వచ్చింది. బాహుబలి తర్వాత అంతటి హయ్యెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమా కంటే ఎక్కువ TVR వచ్చిందంటే దేవరకొండ క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి, ఫామిలీ కంటెంట్ కావడం,ఎంటర్టైనర్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.