కౌశల్ కు వచ్చిన 40 కోట్ల ఓట్లు,”కౌశల్ ఆర్మీ” పై గీత మాధురి సంచలన వ్యాఖ్యలు.!

Saturday, October 13th, 2018, 11:35:37 AM IST

బుల్లి తెర పై బిగ్ బాస్ షో రెండో సీసన్ ముగిసిపోయి చాలా రోజులు అవుతుంది కానీ అందులో పోటీదారులు మాత్రం ఏదొక ఇంటర్వ్యూతో అలా దర్శనమిస్తున్నారు.అలాగే బిగ్ బాస్ ఫైనలిస్టుల్లో కౌశల్ తో పాటు స్టేజి ని పంచుకున్నటువంటి గీత మాధురి కౌశల్ కి వచ్చిన ఓట్ల సంఖ్య కోసం మరియు అతని కౌశల్ ఆర్మీ కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారు.కౌశల్ కు తనకు కొన్ని కోట్ల ఓట్లు తేడా ఉంటె ఉండొచ్చని అందులో పెద్ద ఆశ్చర్యపోయే విషయం ఏమి లేదని,తెలిపారు.

ఆయన అభిమానులు ఆక్టివ్ గా పనిచేసి ఒక రెండు అకౌంట్లు తయారు చేసుకొని ఓట్లు వేసి ఉంటారని,నా అభిమానులు ఎంత వరకు చెయ్యాలో అంత చేశారని అన్నారు.అదే సందర్భంలో కౌశల్ ఆర్మీ కోసం మాట్లాడుతూ వారు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడే కౌశల్ చాలా సార్లు తనకి కౌశల్ ఆర్మీ ఉందని చెప్పారని,ఆయన అభిమానులు తనని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని అనేవారని నేను అవన్నీ అప్పుడు పెద్దగా పట్టించుకోలేదని అన్నారు.ఎవరి అభిమానులు వారికి ఉంటారని ఇందులో పెద్ద ఆశ్చర్యపోయేంత విషయం లేదు అన్నట్టుగా గీత మాధురి సమాధానం ఇచ్చారు.