విజ‌య్ దేవ‌ర‌కొండ‌ రాకింగ్.. మ‌రోసారి గీత గోవిందం షేకింగ్..!

Thursday, December 6th, 2018, 11:40:59 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన గీత గోవిందం చిత్రం ఎలాంటి అంచ‌నాలు లేకుండా.. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విజయ్ ఫ్యామిలీ హీరోగా కూడా మంచి మార్కులు కొట్టేసాడు. యూత్ మోత్తాన్ని ఈ సినిమా ఒక మాయలోకి తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో బాక్సాఫీస్ వద్ద ఊహించ‌ని విధంగా క‌లెక్ష‌న్లు సాధించి ట్రేట్ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్య ప‌ర్చిన ఈ సినిమా బుల్లితెర పై కూడా సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుంది.

ఈ ఏడాదే ఆగ‌స్టు 15న విడుద‌లైన ఈ చిత్రం వందకోట్ల క్ల‌బ్‌లో చేరిన విష‌యం తెలిసిందే. ఇక వంద‌రోజులు పూర్తి కాకుండానే ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా బుల్లితెర పై ప్ర‌సారం అయ్యి రికార్డు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 20.8 టీఆర్పీ సాధించిన గీత గోవిందం ఈ ఏడాది అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన రంగ‌స్థ‌లం(19.5) మూవీ రికార్డ్‌ని బ్రేక్ చేసంది. అయితే ఇటీవ‌ల మ‌రోసారి టీవీల్లో ప్ర‌సార‌మైన గీత గోవిందం మ‌రోసారి ఆశ్చ‌ర్య‌పోయే టీఆర్పీ సొంతం చేసుకుంది. ఇటీవ‌ల జీతెలుగులో టెలికాస్ట్ అయిన ఈ చిత్రం 17.16 టీఆర్పీని పొంది, మ‌రో రికార్డును సాధించి బుల్లితెర‌ను షేక్ చేసింది. దీంతో గీత‌గోవిందం మూవి టాలీవుడ్ వర్గాల్లో మ‌రోసారి హాట్ టాపిక్ అవుతుంది.