హైదరాబాద్ లో అక్రమ హోర్డింగుల తంతు ముగిసింది…

Tuesday, March 13th, 2018, 05:31:58 PM IST

వ్యాపారం కోసం ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా హోర్డింగులు వేసి నగరాన్ని అందవికకారం చేస్తున్నారన్న ఆలోచనతో, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో గుర్తించిన అక్ర‌మ హోర్డింగ్‌ల‌న్నింటిని నెల రోజుల్లోగా తొల‌గించ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసీ ప్ర‌క‌టనలు జారీ చేసింది. హైద‌రాబాద్‌లో గుర్తించిన 333 అక్ర‌మ హోర్డింగ్‌ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 195 హోర్డింగ్‌లు, ఒక యూనిపోల్‌ను తొల‌గించేసారు. అయితే మిగిలిన 138 హోర్డింగ్‌లు, యూనిపోళ్ల‌ను నెల రోజుల్లోగా తొల‌గించ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్‌ క‌మిష‌న‌ర్ అద్వైత‌కుమార్ సింగ్ వెల్లడించారు. ఖైర‌తాబాద్ ఆర్‌.టి.ఐ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఉన్న అనధికార యూనిపోల్‌ను నేడు తొల‌గించామ‌ని అన్నారు. జ‌న‌వ‌రి 22న ప్రారంభమైన ఈ అక్ర‌మ హోర్డింగ్‌లను తొల‌గించ‌డానికి టెండ‌ర్ ద్వారా మేస‌ర్స్ ఇస్టా యాడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్ప‌గించామ‌ని, 2017 ఏప్రిల్ 19వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన స‌ర్వేలో 333 అక్ర‌మ హోర్డింగ్‌లు ఉన్నట్టు తెలిసిందని వివరించారు.

ప్ర‌స్తుతం తొల‌గిస్తున్న హోర్డింగ్ ప్ర‌క్రియ సంద‌ర్భంగా కూడా కొత్త‌గా అన‌ధికార హోర్డింగ్‌ల‌ను గుర్తించి వాటిని కూడా తొల‌గించ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. ఈ అక్ర‌మ హోర్డింగ్‌ల తొల‌గింపున‌కు ప్ర‌తి జోన్‌కు ప్ర‌త్యేకంగా ఇంజ‌నీర్ల‌ను నియ‌మించామ‌ని తెలిపారు. మిగిలిన 138 హోర్డింగ్‌ల‌ను తొల‌గించే ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తొల‌గించిన 195హోర్డింగ్‌ల‌లో 84హోర్డింగ్‌లు జీహెచ్ఎంసీ నియ‌మించిన‌ ఏజెన్సీ తొల‌గించగా మిగిలిన 111 సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలు స్వ‌యంగా తొల‌గించుకున్నాయ‌ని అన్నారు. తొల‌గించిన‌వాటిలో అత్య‌ధికంగా ఈస్ట్ జోన్‌లో 69, సెంట్ర‌ల్ జోన్‌లో 39, వెస్ట్, నార్త్ జోన్‌ల‌లో 37 చొప్పున, సౌత్ జోన్‌లో 23 అక్ర‌మ హోర్డింగ్‌ల‌ను తొల‌గించామ‌ని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. ఇకనుండైనా జాగ్రత్త పడి మిగిలిన హోర్డింగులను ఎవరికీ వారు తొలగించుకుంటే మంచిదని, ఇంజనీర్లు వచ్చి తొలగించే వరకు వేచి చూసి నష్టపోవద్దని జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్‌ క‌మిష‌న‌ర్ అద్వైత‌కుమార్ సింగ్ అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments