రోజా కూడా చెప్పారు..కానీ జగన్ పట్టించుకోలేదు : ప్రముఖ ఎమ్మెల్యే

Tuesday, December 5th, 2017, 08:39:34 AM IST

గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పాడేరు అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి గత కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినేత సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆమె ఏవరు ఊహించని విధంగా మాట్లాడారు. పార్టీ నుంచి ఆమె వెళ్లిపోవడానికి పలు కారణాలను వివరించారు. ఇక వైసీపీ అధినేత జగన్ తీసుకునే నిర్ణయాల గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా నాయకుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా పార్టీలో ఉన్న నాయకులందరి అభిప్రాయాలు తీసుకుంటాడు. ఇది ప్రతి పార్టీలో ఉండే నియమం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా కాదు అని గిడ్డి ఈశ్వరి తెలియజేశారు. ఇంకా ఆమె ఏం చెప్పారంటే.. మా అభిప్రాయాలు ముందు అడుగుతారు. కానీ ఆ తర్వాత ఫైనల్ గా వారే నిర్ణయం తీసుకుంటారు. ఎదో మేము చెప్పాలి కాబట్టి చెబుతాం. ఉదాహరణకు..అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా లేక బహిష్కరించాలా అనే విషయంపై అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. అందరు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావాలని అనుకున్నారు. మొదటి రోజు పాల్గొని ధర్నా లాంటిది చేద్దామని అనుకున్నాం. ఎమ్మెల్యే రోజా కూడా అలాంటి అలోచనతోనే ఉన్నారు. కానీ జగన్ వద్దనే నిర్ణయానికి సపోర్ట్ చేయక తప్పలేదని ఆమె తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments