మరో రేపిస్ట్ బాబా.. ఆయన డేరా అయితే ఈయన ఫలహరి

Saturday, September 23rd, 2017, 06:00:28 PM IST


ప్రస్తుతం బాబాల గోల చాలా ఎక్కువైందనే చెప్పాలి. ప్రజలు కూడా నిజా నిజాలు తెలుసుకోకుండా చదువుకున్న తెలివిని కూడా పక్కనపెట్టి బాబాల లను నమ్ముతూ మోసపోతున్నారు. రీసెంట్ గా డేరా బాబా రేపిన సంచలనం గురించి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అదే తరహాలో ఒక డెబ్భై ఏళ్ల బాబా యువతిపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకొని బ్రతికే కౌశలేంద్ర ప్రపన్నచార్య ఫలాహారి మహరాజ్‌ (70) రాజస్థాన్ లో చాలా ప్రసిద్ధి చెందిన ఫలాహారి బాబా. అయితే ఇంటర్న్‌షిప్‌ విషయంలో సహాయపడ్డాడు అని ఓ న్యాయ విద్యార్థిని కృతజ్ఞతతో విరాళం ఇవ్వడానికి వెళ్ళింది. దీంతో బాబాగారు బాలికపై అత్యచారం చేశాడు. విషయం బయటకి చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు. అయితే ఆ 21 ఏళ్ల యువతో ఏ మాత్రం భయపడకుండా బాగారిపై పోలీసులకు పిర్యాదు చేయడంతో అత్యాచారం కేసులో ఈ రోజు అరెస్ట‌ చేశారు. మొదట ఆరోగ్యం బాగోలేదని నాటకమాడాడు. విచారణకు రాలేనని చెప్పడంతో పోలీసులు బాబా ఆరోగ్యంపై టెస్ట్ లు చేయించారు. బాగానే ఉందని తెలియడంతో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.

  •  
  •  
  •  
  •  

Comments